హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటిని విడుదల చేయాలని వినతి

NRPT: మరికల్ మండలం కన్మనూర్ గ్రామ రైతులకు కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నీటిపారుదల శాఖ ఈఈ ప్రతాప్‌సింగ్, ఏఈ అభిలష్‌కు వినతిపత్రం అందజేశారు. భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన అధికారులు రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.