హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

NLG: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్వీపర్లు ధనలక్ష్మి, అండాలు, డ్రైవర్లు నర్సింహ, జే.నర్సింహలను ఘనంగా సత్కరించారు.