హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీన్ దయాల్‌కు అభినందనలు

SRD: ఖేడ్ ఆర్టీసీ డిపోలో శ్రామిక్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఎస్.ఆర్. దీన్ దయాల్‌కు బుధవారం అభినందన సభ నిర్వహించారు. డిపో యూనియన్ నాయకుడు నెహ్రూ మాట్లాడుతూ సంస్థకు దీన్ దయాల్ అందించిన సుదీర్ఘ సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు.