WNP: కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన రవి, సరిత దంపతుల కుమార్తె అఖిల మెడిసిన్ సీటు సాధించడంతో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. తన తల్లి పద్మమ్మ జ్ఞాపకార్థం ఈ సాయాన్ని అందజేసి, అఖిల తల్లిదండ్రులను శాలువాతో సన్మానించారు. అఖిల భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థినికి రూ.25 వేల ఆర్థిక సాయం


