హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన

NGKL: నాగర్‌కర్నూల్‌లోని కొల్లాపూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీరాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను ప్రస్తావిస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని బీజేపీ నాయకులు ఆరోపించారు.