హైదరాబాద్: 28°C
తెలంగాణ

MGUలో 42 యూనిట్ల రక్తదానం

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) ఎన్‌ఎస్‌ఎస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి 42 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. వీసీ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని సూచించారు.