ASF: బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామానికి చెందిన మడే వనిత తుంటి మార్పిడి శస్త్రచికిత్సకు CMRF నుంచి రూ.లక్ష మంజూరైంది. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స కోసం జారీ చేసిన LOCని MLA హరీశ్ బాబు బాధితురాలి భర్త గణేష్‌కు బుధవారం అందజేశారు. MLA మాట్లాడుతూ CMRF పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిది అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
బాధితురాలికి LOC అందజేత


