హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

ADB: గిరిజన ప్రాంతమైన గాదిగూడ మండలంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని టీఏజీఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. స్థానికంగా నర్సింగ్ కాలేజీ లేకపోవడంతో మారుమూల గ్రామాల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక విద్యావకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.