NLG: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాల పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు అందించే భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
తెలంగాణ
ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


