హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్ వివాహ్ ముక్త్ భారత్' పోస్టర్‌ ఆవిష్కరణ

ADB: అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో బాల్య వివాహ రహిత గ్రామం అంశాన్ని తప్పనిసరిగా ఎజెండాలో చేర్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టాలపై ప్రజలకు వివరించి, బాల్య వివాహాలు జరగకుండా ప్రత్యేక తీర్మానాలు చేయాలని సూచించారు.