హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రెవెన్యూ డివిజన్ గెజెట్ సాధిస్తాం: కాంగ్రెస్

MDK: రామాయంపేట నియోజకవర్గం రద్దు కావడానికి, అభివృద్ధి ఆగిపోవడానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయని ఆమె, ఇప్పుడు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై బురద చల్లడం విడ్డూరమన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రెవెన్యూ డివిజన్ గెజెట్ సాధిస్తామన్నారు.