హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐక్యతతోనే కురుమల అభివృద్ధి: మల్గొండ

SRD:​ కురుమలు అంతా ఐక్యత చాటినప్పుడే సమాజంలో అభివృద్ధి చెందుతారని కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్గొండ అన్నారు. బుధవారం నాగల్‌గిద్ద మండలంలో నిర్వహించిన కురుమల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో కురుమలు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.