JGL: కోరుట్ల మండలం సంగెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పంచాయతీ భవనం,సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
తెలంగాణ
సంగెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం


