హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారా ఒలింపిక్స్ వరకు వెళ్లి పతకాలు సాధించాలి: కలెక్టర్

GDWL: గద్వాల ఇండోర్ మైదానంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రిజ్వాన్ బాషా క్రీడలను ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడల్లో రాణిస్తే పారా ఒలింపిక్స్ వరకు వెళ్లి పతకాలు సాధించవచ్చని, అందరూ క్రీడాస్ఫూర్తితో పాల్గొని ఉల్లాసంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.