SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజీపల్లి గ్రామ సమీపంలో బుధవారం రసాయన వ్యర్థ జలాలు ఏరులై పారాయి. వ్యర్థ జలాల్లో తెల్లటి నురగతో పాటు ఘాటైన వాసనలు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వ్యర్థ జలాల విడుదల మరింత పెరిగిందని వారు ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రసాయన వ్యర్థ జలాలు.. స్థానికుల అవస్థలు


