హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌లో పోలీసుల అవగాహన

కామారెడ్డి జిల్లా బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రయాణికులకు సూచించారు.