హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆహార భద్రత చట్టం అమలుపై కఠిన పర్యవేక్షణ ఉండాలి'

ADB: ఆహార భద్రత చట్టం అమలు తీరును మరింత కఠినంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షాతో సమావేశమైన ఆయన.. అర్హులందరికీ పౌష్టికాహారం, రేషన్ అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు.