హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది: కౌశిక్‌రెడ్డి

KNR: కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కరీంనగర్ కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, మొత్తం తామే నిర్మించినట్లు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.