హైదరాబాద్: 28°C
తెలంగాణ

చట్టసభలపై అవగాహన ఉండాలి: అ. కలెక్టర్

MDK: జిల్లా కలెక్టరేట్‌లో 31 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే చట్టసభల నిర్వహణపై అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందాలన్నారు. విద్యార్థులు స్పీకర్, మంత్రులు, ప్రతిపక్షాలుగా వ్యవహరించి సభను రక్తికట్టించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందించారు.