హైదరాబాద్: 28°C
తెలంగాణ

షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

MDK: మహిళలు యువత రక్షణే ధ్యేయంగా జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సైబర్ మోసాల నివారణకు 1930, డయల్ 112, టీ-సేఫ్ యాప్‌లపై వివరించారు. పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. ఈవ్‌టీజింగ్ నిరోధానికి షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు.