హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ADB: బజార్‌హత్నూర్ మండలం లక్ష్మీనాయక్ తండాకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త రాథోడ్ ఈశ్వర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడు కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.