MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం ఏహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వారి విద్యా ప్రగతి, బోధనా విధానాలు, పాఠశాల రికార్డులను పరిశీలించారు. ప్రతి విద్యార్థి ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
తెలంగాణ
బాలికల పాఠశాలలో ఐటీడీఏ పీవో తనిఖీ


