హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఉద్యమకారులకు భూములు పంచాలి’

HNK: ఆక్రమణకు గురైన భూములు స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం హన్మకొండ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి పేరుతో జరిగిన భూదందాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.