హైదరాబాద్: 28°C
తెలంగాణ

వయోవృద్ధుల సంక్షేమమే లక్ష్యం: అ. కలెక్టర్

MBNR: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు.