హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి

SRPT: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఎన్నికల ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు చేసినట్లు తెలిపారు.