హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్

NZB : ఆర్మూర్ పట్టణానికి చెందిన బీజేవైఎం సీనియర్ నాయకుడు కలీగోట ప్రశాంత్‌ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారికి ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.