హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు సిబ్బందికి వీడ్కోలు

ములుగు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి బుధవారం పదవీ విరమణ చేసిన వడ్డెబోయిన కాశ సత్యనారాయణ, బోదబోయిన పురుషోత్తంలకు ఘన వీడ్కోలు పలికారు. వారి అంకితభావం, క్రమశిక్షణ, విధినిబద్ధత అభినందనీయమని ఎస్పీ సుధీర్ కేకన్ రామనాథ్ ఐపీఎస్ పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.