హైదరాబాద్: 28°C
వార్తలు

దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

దీపావళి టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని వెల్లడించింది. టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. అయితే 24 గంటల పాటు ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని పేర్కొంది. అవి కాల్చేందుకు నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించనున్నట్లు చెప్పింది.