హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇర్షాద్ ఉద్దీన్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

KMR: జిల్లా సీడీసీ చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ ఉద్దీన్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇర్షాద్ ఉద్దీన్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.