TG: రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తోందని BJP ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. సింగరేణి సంస్థను అమ్ముకునే దిశగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. సాగునీటి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా రైతులకు అవసరమైన నీటిని అందించాలని కోరారు. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీరు, విద్యుత్ అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
వార్తలు
రైతులకు నీళ్లు ఇవ్వండి: ఎంపీ ఈటల


