హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకొండలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

NLG: దేవరకొండలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 70వ స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్, సబ్‌ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ కలిసి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని వారు అన్నారు.