KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను పెంచారు. ఖరీఫ్ పంటలకు రెండో తడి అందించేందుకు బుధవారం ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1,400.66 అడుగులు ఉండగా, 12.076 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని తెలిపారు.
తెలంగాణ
పంట సాగుకు నీటి విడుదల


