ముంబైలో వాతావరణం అనుకూలించని కారణంగా పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ముంబైలో దిగాల్సిన 12 విమానాలను సూరత్, వడోదర ఎయిర్‌పోర్టులకు పంపించారు. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు తీవ్ర గాలులు, మెరుపులు, ఉరుములు ఉండడంతో తప్పనిసరి పరిస్థితులు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.
వార్తలు
12 విమానాల దారి మళ్లింపు


