మహారాష్ట్ర అహల్యనగర్‌లో నకిలీ నోట్లు కలకలం రేపాయి. రూ.93 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ నోట్లతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. డబ్బును రెట్టింపు చేసి ఇస్తామని నమ్మించి ప్రజలను ఈ ముఠా మోసం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
నకిలీ నోట్లు కలకలం.. ముగ్గురు అరెస్ట్


