హైదరాబాద్: 28°C
వార్తలు

మంజీరా పైపులైన్‌ ఆధునీకరణకు రూ.551 కోట్లు

TG: హైదరాబాద్‌ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు 61 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన మంజీరా పైపులైన్‌ పాత బడింది. దీంతో తరచూ లీకేజీలతో పైపులు పగులుతున్నాయి. ఈ క్రమంలో మంజీరా జలాలు అందించే ఫేజ్‌-1, ఫేజ్‌-2 వ్యవస్థను ఆధునీకరించేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.551 కోట్ల వ్యయంతో మైల్డ్‌ స్టీల్‌ (MS) పైపులైన్లను వేయనుంది.