హైదరాబాద్: 28°C
వార్తలు

ఇథియోపియాలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌నకు గురైన ఘటన ఇథియోపియాలో జరిగింది. వీరు అక్రమమార్గంలో అమెరికాకు వెళ్లేందుకు యత్నించే క్రమంలో ఈ ఘటన జరిగింది. వీరిని విడిచిపెట్టాలంటే కిడ్నాపర్లు రూ.1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బాధితుల తల్లిదండ్రులు వాపోయారు. వీరంతా రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. తమ పిల్లలను సురక్షితంగా విడిపించి తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరుతున్నారు.