హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ప్రాంతీయ సదస్సులు

AP: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం ప్రాంతీయ సదస్సు ఇవాళ నిర్వహించనున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్, పర్యవేక్షణ అధికారులు సదస్సుకు హాజరు కానున్నారు.