TG: జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పత్రికా విలేకరిగా పని చేయడం కత్తి మీద సాము లాంటిదని తెలిపారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధి పాత్ర ఎగ్జిక్యూటివ్ పాత్ర అయితే, పాత్రికేయులది జ్యుడీషియల్ పాత్ర అని పేర్కొన్నారు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా ప్రజలకు సకాలంలో వార్తలు అందిస్తారని ప్రశంసించారు.
వార్తలు
జర్నలిజం పవిత్రమైన వృత్తి: పోచారం


