వార్తలు
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం: కేటీఆర్
TG: బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలమని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పని చేస్తూ.. ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.


