GNTR: తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఫిర్యాదుతో తెనాలి రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కాలిశెట్టి ఫణికుమార్, యెల్లా కామేశ్వరరావు తదితరులు తనపై బెదిరింపులకు పాల్పడి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఈ-పేపర్ ద్వారా అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.
వార్తలు
తెనాలి తహసీల్దార్‌కు బెదిరింపులు


