ప్రకాశం: కనిగిరి మండలంలోని బడుగులేరు స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని మంగళవారం డీఎల్‌డీవో శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, వాట్సప్ గవర్నెన్స్, పెండింగ్ సర్వేలు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, రిజిస్టర్ల నిర్వహణపై సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో ఎలాంటి అదనపు రుసుములు లేకుండా అందించాలని సిబ్బందికి సూచించారు.
వార్తలు
స్వర్ణ గ్రామ కార్యాలయంలో డీఎల్‌డీవో తనిఖీ


