హైదరాబాద్: 28°C
వార్తలు

ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

BHPL: భూపాలపల్లి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర, తాగునీరు, నీడ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో 1,05,400 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.