హైదరాబాద్: 28°C
వార్తలు

NCPCRపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ప్రైవేటు బడుల్లో RTE అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం డేటా సేకరించడమే కాకుండా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కమిషన్‌దేనని స్పష్టం చేసింది. అఫిడవిట్‌లో నిర్లక్ష్యంపై మండిపడ్డ సుప్రీం ధర్మాసనం, తీరు మార్చుకోకపోతే NCPCR చీఫ్‌ను నేరుగా కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది.