హైదరాబాద్: 28°C
వార్తలు

కొందరు బాగుపడితేనే అభివృద్ధి కాదు: మోహన్ భాగవత్

కొందరు మాత్రమే బాగుపడటం అభివృద్ధి కాదని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలు ఉన్నతస్థాయికి చేరినప్పుడే దేశం సంతోషంగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వం బాధ్యతే కాదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని సూచించారు.