హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంగోరిగూడెం, బీరెల్లిగూడెంలో పంచాయతీ భవనాల ప్రారంభం

NLG: మునుగోడు మండలంలోని గంగోరిగూడెం, బీరెల్లిగూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.