హైదరాబాద్: 28°C
వార్తలు

మెనూ ప్రకారం భోజనం అందించాలి: డీపీవో

KMM: పెనుబల్లి మండలం వీఎం బంజర పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను డీపీవో వినోద్‌కుమార్‌ మంగళవారం సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, నాణ్యమైన సరుకులనే వినియోగించాలని నిర్వాహకులకు సూచించారు.