JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సంకీర్తన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది. అక్టోబర్ 2 నుంచి 5 వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు హెచ్ఎం కిరణ్ తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక


