హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కంటి వైద్య శిబిరం

NGKL: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌లోని 102వ గదిలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 75 మందికి కంటి పరీక్షలు చేయగా 27 మందికి క్యాటరాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించారు. మందులు అందజేసి, విటమిన్-ఏ అధికంగా ఉండే క్యారెట్, ఆకుకూరలు, చేపలు తీసుకోవాలని సూచించారు.