హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిపోలో ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్

భూపాలపల్లి RTC డిపో పరిధిలో బస్సుల రాకపోకలు, సమయాలు, రూట్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు 7382854256కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని డిపో మేనేజర్ చేరాల మురళీకృష్ణ తెలిపారు. వేగంగా సమాచారం అందించేందుకే ఈ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.