హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభతో బీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌: వెలిచాల రాజేందర్‌రావు

KNR: సిరిసిల్ల వేదికగా జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ గులాబీ పార్టీ పతనానికి నాంది పలుకుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి కేటీఆర్‌కు ఓటమి తప్పదని అన్నారు. ఈ సభకు కరీంనగర్ నుంచి శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం పర్యటనతో స్థానిక రాజకీయాల్లో వేడి మరింత పెరిగింది.